ఉస్తాద్ గా రూటు మార్చిన రాకెట్ రాఘవ
on Jun 3, 2023
జబర్దస్త్ కమెడియన్ రాకెట్ రాఘవ రూటు మార్చాడు. ఈ మధ్య హీరోలను ఇమిటేట్ చేస్తూ గెటప్స్ వేస్తున్నాడు. ఇక ఈ జబర్దస్త్ కి సంబంధించి లేటెస్ట్ గా నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. పవన్ కళ్యాణ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ లుక్ లో రాఘవ కనిపించాడు. పేరు కూడా "ఉస్తాద్ రాకెట్ రాఘవ" అని టైటిల్స్ లో వేయించుకున్నాడు. అలాగే పవన్ కళ్యాణ్ జీప్ మీద ఎలా ఐతే జంప్ చేసి దిగుతాడో అలాగే రాఘవ కూడా చేసాడు.
పోలీస్ గెటప్ తో స్కిట్ లోకి వచ్చేసరికి "పవర్ స్టార్ గారి ఎంట్రీ అంటే కంట్రీ షేక్ ఐపోతుంది..ఆయన ఎంట్రీకి ఒక రేంజ్ ఉందండి" అని తోటి కమెడియన్ డైలాగ్ చెప్పేసరికి "మరి నా ఎంట్రీకి" అని రాఘవ రివర్స్ లో అడిగాడు "మేముండడమే ఎక్కువ" అన్నాడు.. ఆ మాటకు కోపమొచ్చిన రాఘవ గన్ తీసి మరో కమెడియన్ నోరు తెరిచి గొంతులోకి గురిపెట్టి "ఎవర్రా నువ్వు గురి పెట్టి గుండు వదిలాననుకో అది తిన్నగా కాకినాడ వెళ్లి కృష్ణ భగవాన్ గారింట్లో ఉదయాన్నే టిఫన్ చేసి అటు నుంచి అటే చెన్నై వెళ్లి ఇంద్రజ గారింట్లో మధ్యాహ్నం లంచ్ చేసి ఇలా నీ గొంతులో దూరిపోద్ది ఏమనుకుంటున్నావో" అని బెదిరించేసాడు. ఇలా రాఘవ ఎంటర్టైన్ చేసాడు.
తర్వాత వెంకీ మంకీస్ టీం అంతా ఈగ మూవీలో కొన్ని బిట్స్ ని స్పూఫ్ గా చేసి చూపించారు. నూకరాజు టీం రౌడీ గెటప్స్ లో వచ్చి స్కిట్ చేశారు. ఇలా ప్రోమో చూపించారు ఇక ఎండింగ్ లో పవన్ కళ్యాణ్ రేంజ్ లో రాఘవ కుర్చీలో కూర్చుని టీ తాగుతూ "ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది" అంటూ ఆయన డైలాగ్ కి లిప్ సింక్ ఇవ్వడంతో ప్రోమో ఎండ్ అయ్యింది.
ఈ ప్రోమోలో జీప్ మీద నుంచి దూకిన రాఘవ బిట్ చూసిన నెటిజన్స్ "జీప్ నుంచి ఏమి జంప్ చేశారు రాఘవ్ గారు సూపర్... " అని కొంత మంది పవన్ కళ్యాణ్ ఫాన్స్ కామెంట్స్ చేస్తుంటే కొంతమంది మాత్రం "ఓ రాఘవ నువ్వు కూడా స్టార్ట్ చేశావా" అని కామెంట్స్ పెడుతున్నారు...రాఘవ ఎప్పుడూ ఎవరినీ ఇమిటేట్ చేయకుండా తన ఓన్ స్కిట్స్ తాను చేసుకెళతాడనే ఒక సాఫ్ట్ కార్నర్, మంచి ఇంప్రెషన్ ఉండేది ఆడియన్స్ కి...కానీ రాఘవ కూడా మిగతా వాళ్ళ లానే చేంజ్ అయ్యేసరికి ఆడియన్స్ కి నచ్చడం లేదు.
Also Read